Kaizer News

Veligonda: మెట్ట ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టే జీ

Veligonda: మెట్ట ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టే జీవనాడి: మంత్రి అచ్చెన్నాయుడు!

· State - Telangana · hmtvlive.com

వెలిగొండ: దశాబ్దాలుగా కరువు, వర్షాభావంతో అల్లాడుతున్న మెట్ట ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టు జీవనాడిగా మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం అవుతున్న వేళ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.53 టీఎంసీల కృష్ణా వరద జలాలను నల్లమల కొండల గుండా తరలించి, మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే వెలిగొండ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. మార్కాపురం జిల్లాలో 3,08,700 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 27,400 ఎకరాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84 వేల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టును రూపొందించినట్లు వివరించారు. వెలిగొండ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని.. కరువుతో పోరాడుతున్న రైతులకు భరోసా, నీటి కోసం ఎదురుచూస్తున్న గ్రామాలకు జీవనాధారం, వలసలతో సతమతమవుతున్న కుటుంబాలకు సొంత ప్రాంతంలోనే ఉపాధి కల్పించే ప్రాజెక్టు అని అచ్చెన్నాయుడు అన్నారు. సాగునీటితో పాటు కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీటి భద్రత కూడా లభిస్తుందని తెలిపారు. నాలుగు జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన సుమారు 15.25 లక్షల మందికి కాలువల నెట్‌వర్క్ ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు.. పశ్చిమ ప్రకాశంలోని ఏడు నియోజకవర్గాల్లో 1,657 ఆవాసాలకు తాగునీటి ప్రయోజనం కలగనుందని చెప్పారు. మొత్తం 23 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రాజెక్టును రూపొందించినట్లు పేర్కొన్నారు. నల్లమలసాగర్ జలాశయం నిండడం, కాలువలు, చెరువులకు నీరు చేరడంతో ఆయకట్టు ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం 30 నుంచి 60 మీటర్ల లోతులో లభిస్తున్న భూగర్భ జలాలు కొన్ని ప్రాంతాల్లో సుమారు 8 మీటర్ల లోతులోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు నివేదిక అంచనా వేసిందని తెలిపారు. 1996లో వెలిగొండకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు.. మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం అరుదైన ఘట్టమని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పెండింగ్ పనులను వేగవంతం చేసిందని చెప్పారు. టన్నెల్-2లో మిగిలిన 4.924 కిలోమీటర్ల బోరింగ్ పనులను 23 నెలల్లో పూర్తి చేయడం, హెడ్ రెగ్యులేటర్లు, సొరంగాలు, ఫీడర్ కాలువ వంటి కీలక పనులను ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కేవలం 26 నెలల్లో సుమారు రూ.2,402 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. నల్లమల కొండల్లో సుమారు 18.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన రెండు భారీ సొరంగాలు వెలిగొండ ప్రాజెక్టులో ఇంజినీరింగ్ అద్భుతాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వరద సమయంలో కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించేలా ఈ వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. అక్కడి నుంచి తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన కాలువల ద్వారా విస్తారమైన ఆయకట్టుకు సాగునీరు చేరుతుందని వివరించారు. వెలిగొండ నీరు రైతు పొ

Original source: hmtvlive.com
Read more on Kaizer News