Kaizer News

IPL Auction | డిసెంబర్‌లో ఐపీఎల్ 2027 వేలం.. వేదిక

IPL Auction | డిసెంబర్‌లో ఐపీఎల్ 2027 వేలం.. వేదికపై ఉత్కంఠ..!

· Sports · ntnews.com

IPL Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కీలక పదవులకు ఎన్నికలు ముగియడంతో 20వ సీజన్ వేలం(Auction)పై స్పష్టత వచ్చింది. ఈ డిసెంబర్‌లోనే మినీ వేలం జరుగనుంది. డిసెంబర్‌ రెండో వారంలో ఆక్షన్ నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI), ఐపీఎల్ పాలకమండలి సన్నాహకాలు చేస్తున్నాయి. గత మూడు సీజన్లుగా విదేశాల్లోనే వేలం పాట జరుపుతున్నారు. దాంతో, ఈసారి కూడా అదే ఒరవడిని కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే వేలం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆనవాయితీ అయిన వేలానికి వేళవుతోంది. ఇరవయ్యో సీజన్ కోసం డిసెంబర్ రెండో వారంలో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ, ఐపీఎల్ కార్యవర్గం సిద్ధమవుతున్నాయి. శుక్రవారం జరిగిన బోర్డు 95వ వార్షిక సమావేశంలో ఐపీఎల్ మినీ వేలం అంశంపై సభ్యులు చర్చించారు. అందరి సూచన మేరకు త్వరలోనే పది ఫ్రాంచైజీల యజమానులతో మాట్లాడి వేలం తేదీలను ఖరారు చేయనుంది బీసీసీఐ. అయితే.. గత మూడు సీజన్ల మాదిరిగా దుబాయ్, అబూదాభీలోనే వేలం నిర్వహిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 2023-27 సైకిల్‌లో ఇదే ఆఖరి మినీ వేలం. ఐపీఎల్ మొదలై 20 ఏళ్లు కాబోతున్నందున ఈ సీజన్‌ను ఘనంగా జరపాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్‌ కార్యవర్గానికి ఎన్నికలు ముగియడంతో వేలంపై కసరత్తు చేస్తోంది బీసీసీఐ. 19వ సీజన్‌ వేలం డిసెంబర్ 16l జరిగినా.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా టోర్నీ ఆలస్యంగా మొదలైంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇటీవలే అరుణ్‌ ధుమాల్ ఐపీఎల్ చైర్మన్‌గా, ఖైరుల్ మజుందార్‌ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. నిరుడు మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కామెరూన్ గ్రీన్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్‌ను ఏకంగా రూ.25.20 కోట్లకు కొన్నది కోల్‌కతా నైట్ రైడర్స్. రెండో అత్యధిక ధర రూ.18 కోట్లను మథీశ పథిరన కోసం ఆ ఫ్రాంచైజీయే చెల్లించింది. కామెరూన్ గ్రీన్(ఆస్ట్రేలియా) – రూ.25.20 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ మథీశ పథిరన(శ్రీలంక) – రూ.18 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ కార్తిక్ శర్మ (భారత్, అన్‌క్యాప్డ్) – రూ.14.20 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ ప్రశాంత్ వీర్(భారత్, అన్‌క్యాప్డ్) – రూ.14.20 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ లియాం లివింగ్‌స్టోన్(ఇంగ్లండ్) – రూ.13 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్

Original source: ntnews.com
Read more on Kaizer News