Kaizer News

Madanapalle: మదనపల్లెలో వైభవంగా వినాయక శోభాయాత్ర మ

Madanapalle: మదనపల్లెలో వైభవంగా వినాయక శోభాయాత్ర మరియు నిమజ్జనం!

· State - Telangana · hmtvlive.com

Shorts Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె రామిరెడ్డి లేఔట్‌లోని నాయక్ వీధిలో నాయక్ సూరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఏనుగు వాహనంపై కొలువుదీరిన వినాయకుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల కోలాహలం నడుమ శోభాయాత్రగా తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరకు నాయక్ ఉత్సవ కమిటీ సభ్యులు రూ.1,85,000లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నాయక్ సూరి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా భక్తులు, యువత సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జన వేడుకల్లో భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News