తొర్రూరు, ఆంధ్రప్రభ : కరీంనగర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 13వ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు తొర్రూరు డివిజన్ కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థినులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పసునూరి వనజ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ విద్యార్థినులు యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వారిలో అను, రుచిత, ఇస్రత్, స్పందన, విష్ణుప్రియ, అక్షిత, నజ్మ, అఖిల, సాహితి, వర్షిని, అర్షియా, సానియా ఉన్నారని తెలిపారు. యోగా వంటి ఆరోగ్యకరమైన విద్యను నేర్చుకుని రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. విద్యార్థినులకు శిక్షణ ఇచ్చిన పీఈటీ ఎ.కళ్యాణిని అభినందించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థినులను పాఠశాల కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది అభినందించారు