Kaizer News

Sircilla: సిరిసిల్ల ప్రభుత్వ బడిలో రోబో టీచర్ సందడ

Sircilla: సిరిసిల్ల ప్రభుత్వ బడిలో రోబో టీచర్ సందడి!

· State - Telangana · hmtvlive.com

Shorts Sircilla: సిరిసిల్లలోని గీతానగర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశం వినూత్న ప్రయోగానికి వేదికైంది. ఇండస్ ల్యాబ్ వారు పాఠశాలకు బహుకరించిన రోబో టీచర్ ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇది తొలి రోబో టీచర్‌గా పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. కార్యక్రమం ప్రారంభంలో పాఠశాల హెచ్‌ఎం శారద విద్యార్థుల ప్రగతి, వారు సాధించాల్సిన సామర్థ్యాలపై తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం ఉపాధ్యాయులు మైలారం తిరుపతి, రాజలింగం, భూపాల్ రెడ్డి, తిరుపతి, స్వప్న, విమోచన, అర్చన, మంజుల తదితరులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడారు. అనంతరం రోబో టీచర్‌తో తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాబోధన, విద్యార్థుల ప్రగతికి సంబంధించి తల్లిదండ్రులు అడిగిన పలు ప్రశ్నలకు రోబో టీచర్ స్పష్టంగా సమాధానాలు ఇవ్వడంతో వారి సందేహాలు నివృత్తి అయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రోబో టీచర్ నేరుగా తమతో మాట్లాడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం, సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధనలో సాంకేతికతను వినూత్నంగా వినియోగించడం పట్ల ఆసక్తి వ్యక్తమైంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News