జనగాం జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఆయా మున్సిపాలిటీల స్థానిక అభ్యర్థులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం ఖాళీలు (54): అన్‌స్కిల్డ్ శానిటేషన్ వర్కర్లు 30, ఎలక్ట్రిషియన్లు 4, హెవీ వెహికల్ డ్రైవర్లు 20. ఎలిజిబిలిటీ అన్‌స్కిల్డ్ శానిటేషన్ వర్కర్లు (స్వీపర్లు/ పారిశుద్ధ్య కార్మికులు): 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. శారీరక దారుఢ్యం కలిగి ఉండటం తప్పనిసరి. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రిషియన్లు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవర్లు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ jangaon.telangana.gov.in ను సందర్శించండి