కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్ (Toxic) ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 'టాక్సిక్' మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ZEE5 సొంతం చేసుకోగా... ఓటీటీ, శాటిలైట్ రైట్స్ కోసం సదరు ఓటీటీ సంస్థ దాదాపు రూ.235 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఇది మంచి నెంబర్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ కానీ, ఓటీటీ సంస్థ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే అనౌన్స్‌మెంట్ రానుంది. మరోవైపు, ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ దూసుకెళ్లగా... ఆ తర్వాత రెండు రోజుల్లో వసూళ్ల జోరు తగ్గింది. ఇప్పటివరకూ ఇండియావ్యాప్తంగా రూ.178 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుండగా... మూడో రోజు రూ.26 కోట్ల నుంచి రూ.28 కోట్ల వరకూ వచ్చినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ మూడు రోజుల్లో రూ.220 కోట్లకు పైగా గ్రాస్ కలక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. .. హుషారెత్తించే లిరిక్స్ ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించగా... పవర్ ఫుల్ రాయగా యశ్ కనిపించారు. నదియా పాత్రలో కియారా అద్వానీ, రెబెకాగా తారా సుతారియా, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్, గంగ పాత్రలో నయనతార, ఎలిజిబెత్‌గా హుమా ఖురేషీ నటించారు. వీరితో పాటే అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, డారెల్లా డిసిల్వా, అమిత్ తివారీ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మించారు. రాయ (యశ్), గంగ (నయనతార) అక్కా చెల్లెళ్లు. చిన్నప్పుడే పేరెంట్స్‌ను కోల్పోయి వీధిన పడతారు. తెలిసీ తెలియని వయసులో రాయ ఆయుధం చేతపట్టి నేర సామ్రాజ్యంలోకి అడుగుపెడతాడు. అక్క కూడా తమ్ముడికి సపోర్ట్ చేస్తుంటుంది. గోవాలో సాల్వెడార్ (డారెల్ డిసిల్వా)కు చెందిన ముఠాతో కలిసి వర్క్ చేస్తుంటారు. సాల్వెడార్ కూతురు రెబెకా (తారా సుతారియా)తో రాయకు సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ తర్వాత అనుకోని ఘటనలతో నదియా (కియారా అద్వానీ)కి దగ్గరవుతాడు రాయ. ఇద్దరి మధ్య ప్రేమకు గుర్తుగా నదియా గర్భం దాలుస్తుంది. ఈ బంధం నేర సామ్రాజ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలిగించింది? రాయకు నదియా ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? నదియాకు జన్మించిన బిడ్డ తన తండ్రిని కలిశాడా? రాయ లైఫ్‌లో వచ్చిన మరో అమ్మాయి మెలిసా (రుక్మిణి వసంత్) ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ర్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. Up Next Up Next Up Next Up Next యేష నాగుల కట్ట మీద యేసె ఉయ్యాల - నాన