Kaizer News

Nandyal: గ్రామీణ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఆర్‌

Nandyal: గ్రామీణ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఆర్‌సెట్టి డైరెక్టర్ ప్రకటన

· State - Telangana · hmtvlive.com

నంద్యాల: జిల్లా గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్ నందు ఉచిత శిక్షణ. యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ [RSETI], నంద్యాల ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణా కార్యక్రమం 17.09.2026 నుండి ప్రారంభమగును. నంద్యాల జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుండి 50 సంవత్సరాల లోపు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణా కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పించబడును. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్ అందజేయబడునని సంస్థ డైరెక్టర్ శ్రీమతి అరుణకుమారి తెలియజేశారు మరిన్ని వివరాలకు క్రాంతి నగర్, నంద్యాల లోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ నందు సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:8500677585, 9705696601

Original source: hmtvlive.com
Read more on Kaizer News