అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఏపీ తీరానికి చేరనుంది. కోస్తాంధ్రలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు, గాలులు. తెలంగాణలో రెండు రోజులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు. AP TS Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది క్రమంగా బలపడుతూ, సోమవారానికి వాయుగుండంగా, మంగళవారం నాటికి తీవ్రవాయుగుండంగా బలపడి, బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్ష సూచన చేసింది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులకు అవకాశం ఉందని, చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 23, 24వ తేదీ అల్పపీడనం తీవ్ర వాయుగుండం లేదా తుపానుగా మారి ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రేపటి నుంచి వర్షాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ేదీల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని నిర్దేశిత జిల్లాల్లో కేవలం సాధారణ వర్షాలే కాకుండా, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వర్షాల సమయంలో గంటకు సుమారు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాజస్థాన్ ప్రాంతం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు ఐఎండీ అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండంగా మారే అవకాశం ఉందని దీని కారణంగా ప్రస్తుతం తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల రెండు, మూడు రోజుల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. శం ఉంది? అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుండి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది సోమవారానికి వాయుగుండంగా, మంగళవారానికి తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు వర్ష హెచ్చరిక జారీ చేయబడింది. కొన్నిచోట్ల