Kaizer News

కాంగ్రెస్‌ ఆస్తి పరిరక్షణకు న్యాయపోరాటం

కాంగ్రెస్‌ ఆస్తి పరిరక్షణకు న్యాయపోరాటం

· State - Telangana · prabhanews.com

చారిత్రక స్థలంపై పీవీ మోహన్‌ ఆరా 1942లో అయ్యదేవర కాళేశ్వరరావు ధారాదత్తం చేసిన ఆస్తి తక్షణం న్యాయపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశం ఏఐసీసీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ పార్టీ బలోపేతంపై నేతలతో చర్చ నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామలో కాంగ్రెస్‌ పార్టీకి చారిత్రకంగా సంబంధం ఉన్న ఆస్తి పరిరక్షణకు న్యాయపోరాటం చేపట్టాలని ఆ పార్టీ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జి, కర్ణాటక ఎమ్మెల్సీ పీవీ మోహన్‌ ఆదేశించారు. శనివారం నందిగామ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన.. ఆస్తికి సంబంధించిన పూర్వాపరాలు, ప్రస్తుత న్యాయపరమైన పరిస్థితి, ఇప్పటివరకు పార్టీ తరఫున తీసుకున్న చర్యలపై స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. నందిగామకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ తొలి స్పీకర్‌గా పనిచేసిన అయ్యదేవర కాళేశ్వరరావు 1942లో నందిగామలోని సుమారు నాలుగు ఎకరాల భూమిని కాంగ్రెస్‌ కార్యకలాపాలు, ఖాదీ–గ్రామీణ పరిశ్రమలు, హరిజన సేవ, సాహిత్యాభివృద్ధి, వయోజన విద్య తదితర నిర్మాణాత్మక కార్యక్రమాలకు వినియోగించే ఉద్దేశంతో ట్రస్టు రూపంలో ఏర్పాటు చేసినట్లు న్యాయస్థాన రికార్డులో నమోదైంది. ఈ చారిత్రక ఆస్తి విషయంలో గతంలో పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణం, తదనంతరం ఆస్తిని ప్రభుత్వానికి బదలాయించే గిఫ్ట్‌ డీడ్‌ వ్యవహారం చోటుచేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు సంబంధించిన తీర్పు రికార్డులో పేర్కొనబడింది. ఈ నేపథ్యంలో ఆస్తిపై ప్రస్తుతం ఉన్న హక్కులు, ట్రస్టు స్థితి, గతంలో జరిగిన బదలాయింపుల చట్టబద్ధత తదితర అంశాలను న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పీవీ మోహన్‌ సూచించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంతో ముడిపడిన ఇలాంటి ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత పార్టీపై ఉందని పీవీ మోహన్‌ పేర్కొన్నారు. నందిగామలో అయ్యదేవర కాళేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఆస్తి విషయంలో ఇక ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలను అన్వేషించాలని సూచించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌ వడ్డీ సోమశేఖర్‌, ఎన్టీఆర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొర్రా కిరణ్‌, నందిగామ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ పాలేటి సతీష్‌లను పీవీ మోహన్‌ ప్రత్యేకంగా ఆదేశించారు. సంబంధిత పత్రాలు, రికార్డులు, గత న్యాయవ్యవహారాలను పరిశీలించి తక్షణమే న్యాయపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వ్యవహారంలో ఏఐసీసీ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నందిగామతో పాటు ఎన్టీఆర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై కూడా పీవీ మోహన్‌ స్థానిక నేతలతో చర్చించారు. మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, కార్యకర్తలను సమన్వయం చేయడం, భవిష్యత్‌ కార్యాచరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు బొర్రా కిరణ్‌, స్థానిక నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు జాతీయ నాయకత్వం

Original source: prabhanews.com
Read more on Kaizer News