Kaizer News

Rayachoti: రాయచోటిలో భక్తిశ్రద్ధలతో 3వ శ్రావణ శనివ

Rayachoti: రాయచోటిలో భక్తిశ్రద్ధలతో 3వ శ్రావణ శనివారం వేడుకలు!

· State - Telangana · hmtvlive.com

Rayachoti: శ్రావణమాసం 3వ శనివారం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మాండవ్య నది ఒడ్డున కీర్తిశేషులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ శ్రీ సుగవాసి పాలకొండరాయుడు గారు నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కుమారుడు, రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, రాయచోటి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. “భగవంతుని సేవలో భక్తి ఎంత పవిత్రమో... ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంతకంటే గొప్ప మానవ సేవ.” 3వ శ్రావణ శనివారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులందరికీ అన్నప్రసాదాన్ని అందించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ “శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. “భక్తి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది... సేవ సమాజానికి సంతోషాన్ని అందిస్తుందన్నారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ప్రసాద్ బాబు గారిని ఆశీర్వదించారు. కార్యక్రమానికి హాజరైన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు వాకా అన్నయ్య గారు ఆత్మీయ స్వాగతం పలికి, శాలువా, గజమాలతో ఘనంగా సన్మానించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News