వరంగల్ విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయి పనులు మొదలయ్యాయని సీఎం తెలిపారు. కొత్త విమానాశ్రయానికి పేర్ల సూచనలు ఇవ్వాలని సీఎం ప్రజలను కోరారు. దర్శకులు సందీప్, శ్రీకాంత్ రుద్రమ, సమ్మక్క సారక్క పేర్లను సూచించారు. హైదరాబాద్: వరంగల్‌లో ప్రపంచ స్థాయి విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే దశాబ్దాల నాటి కల త్వరలోనే సాకారమవబోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ ప్రజల కలను సాకారం చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.295 కోట్లు కేటాయించిందని, అవసరమైన పూర్తి భూమిని సేకరించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అప్పగించినట్లు స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో వేగంగా ప్రారంభమవుతున్నాయని వివరించారు. త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టు నుండి విమాన ప్రయాణం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న రేవంత్ రెడ్డి.. ఈ కొత్త విమానాశ్రయానికి ఏ పేరు పెడితే బాగుంటుందో ప్రజలు తమ సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పోస్టుపై టాలీవుడ్ డైరెక్టర్లు సందీప్ రెడ్డి, శ్రీకాంత్ ఓదెల స్పందించారు. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వరంగల్ ఎయిర్ పోర్టు కల త్వరలో సాకారం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఓరుగల్లు వారసత్వాన్ని ప్రతిబింబించేలా రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లేదా కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని మామునూరు విమనాశ్రయానికి పేరు పెట్టాలని సూచించారు. ఈ పేర్లు పెడితే వరంగల్ సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వానికి తగిన గుర్తింపు లభించినట్లుగా ఉంటుందని సందీప్ రెడ్డి అభిప్రాయపడ్డారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి ట్వీట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. That's the spirit అని రిప్లై ఇవ్వగా.. ప్రస్తుతం ప్రభాస్‌తో తాను తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీలో సేమ్ డైలాగ్ రాశానని.. స్వయంగా సీఎం రేవంత్ నుంచి ఈ మాట రావడం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని సందీప్ సైతం రిప్లై ఇవ్వడంతో వైరల్ గా మారింది. సీఎం రేవంత్ పోస్టుపై మరో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా స్పందించారు. చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి గుర్తుగా మామునూరు విమనాశ్రయానికి 'సమ్మక్క-సారక్క ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్' అని నామకరణం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. పోరాటానికి, ధైర్యానికి ప్రతీకలుగా నిలిచిన తల్లీకూతురు సమ్మక్క, సారక్కలకు మనం ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఈ వరంగల్ మామునూరు విమానాశ్రయం కేవలం ఒక ఎయిర్‌పోర్టు మాత్రమే కాదని, లక్షలాది మంది ప్రజల కల అన్నారు. ఇది సాకారం చేస్తున్నందున సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. చారిత్రక, సాంస్కృతి, ఆధ్యాత్మికంగా ఫేమస్ అయిన వరంగల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుండటంపై హర్షం వ్యక్తం చేశారు. హీరో నానితో శ్రీకాంత్ ఓదెల తీసిన లేటెస్ట్ మూవీ 'ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. Frequently Asked Questions వరంగల్ విమానాశ్రయం ప్రాజెక్ట్ గురించి తాజా అప్‌డేట్ ఏమిటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌లో