Kaizer News

Nellore: యూపీఐ చార్జీల పెంపు ప్రతిపాదనపై కాంగ్రెస్

Nellore: యూపీఐ చార్జీల పెంపు ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ధర్నా

· State - Telangana · hmtvlive.com

Shorts నెల్లూరు: యూపీఐ లావాదేవీలపై చార్జీల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులో ధర్నా నిర్వహించారు. నగరంలోని మాగుంట లేఔట్‌లో ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూపీఐ పేరుతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. డిజిటల్ ఇండియా లక్ష్యం ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే తప్ప, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చడం కాదన్నారు. యూపీఐ లావాదేవీలపై చార్జీల విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News