Kaizer News

వ్యాన్‌ ఢీకొని ఇద్దరికి గాయాలు

· State - Telangana · sakshi.com

గండేపల్లి: ఎద్దులను తరలిస్తున్న వ్యాన్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు విజయనగరం జిల్లా అలమండ సంత నుంచి ఏలూరుకు 8 ఎద్దులను తరలిస్తున్న మినీ బొలేరో వ్యాన్‌ కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని జెడ్‌ రాగంపేట సీహెచ్‌సీకి వెళ్లే మార్గంలోకి వచ్చే సరికి మోటార్‌ సైకిల్‌ను డీకొంది. ఈ ప్రమాదంలో మోటార్‌ సైకిల్‌ నడుపుతున్న తాళ్లూరుకు చెందిన సాయి తీవ్రంగా గాయపడగా, మర్రిపాక నుంచి మిరప కోతకు యల్లమిల్లి వెళుతున్న లక్ష్మి గాయపడిందన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సీహెచ్‌సీకి తరలించగా తీవ్రంగా గాయపడిన సాయిని జగ్గంపేట ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఎద్దులను తరలిస్తున్న వ్యాన్‌ను గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా వ్యాన్‌లో తరలిస్తున్న ఎద్దులకు ఎటువంటి ఆహార పానీయాలు లేకపోగా కనీసం కాలు కదపలేని స్థితిలో కిక్కిరిసిన ప్రయాణంతో వేదన పడుతున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు: మండలంలోని టి.రాయవరం సమీపంలోని చేపల చెరువు లీజు దారుడి హత్య కేసులో ప్రధాన సూత్రధారి హతుని కుమార్తెను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం టి.రాయవరం గ్రామ శివారున చేపల చెరువు మకాం వద్ద ఈనెల 11 అర్ధరాత్రి ఏలూరు జిల్లా పైడి చింతపర్రుకు చెరువు లీజుదారు మోరి నరసింహారావు (70) హత్య కేసులో నిందితుడు అనకాపల్లి జిల్లా పాయకరావు పేట మండలం పడాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేన్‌ డ్రైవర్‌ వీర్ల జయ నాగ వెంకట సత్యనారాయణ అనే జయబాబును శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తండ్రిని పథకం ప్రకారం అతడితో హత్య చేయించిన బలే నాగలక్ష్మిని స్థానిక జాతీయ రహదారిపై పాదాలమ్మ తల్లి ఆలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై ఎస్‌.లక్ష్మీకాంతం తెలిపారు. కడియం: మండలం దుళ్ల గ్రామంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలి నుంచి పర్సును లాక్కుని రూ.4,700 నగదును చోరీ చేశారు ఇద్దరు దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో డి.పార్వతి అనే మహిళ గ్యాస్‌ ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు గేటు నుంచి లోపలికి వచ్చి డబ్బులు ఇమ్మని బెదిరించారు. సదరు మహిళ కేకలు వేసి, చుట్టుపక్కల వారిని పిలవడంతో ఆమె పక్కనే ఉన్న పర్సులోని రూ. 4,700 నగదును లాక్కుని పారిపోయారు. కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత ఆమె పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ శివప్రియ, కడియం ఇన్‌స్పెక్టర్‌ ఎ. వెంకటేశ్వరరావు, ఏఎస్‌ఐ సీహెచ్‌ రమణలతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట

Original source: sakshi.com
Read more on Kaizer News