స్టాఫ్ యూనియన్ ప్రాంతీయ సదస్సుకు 800 మంది ఉద్యోగులు హాజరు మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హరిహర గార్డెన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎస్బీఐ ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి యూనియన్ ద్వారా కృషి చేసే అంశాలపై సదస్సులో చర్చించారు. ఈ సదస్సుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుమారు 800 మంది ఎస్బీఐ ఉద్యోగులు హాజరయ్యారు. ఉద్యోగులు విధులు నిర్వహించే సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. ఖాతాదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం, వారి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వంటి అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఉద్యోగుల సమస్యలను యూనియన్ దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో సూచించారు. ఉద్యోగులు తమ విధులను బాధ్యతగా నిర్వహిస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు సీహెచ్ శ్రీధర్, జనరల్ సెక్రటరీ కేఎస్ సంధ్యాలయ, ఎం. ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ జీవీ సుబ్బారావు, జనరల్ సెక్రటరీ భ్రమరాంభ, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ కుమార్, పి. సైదులు, వెంకటేశ్వర్లు, రాములు, మాధవరెడ్డి, నర్సింహ, రాంబాబు, మహేష్, నరేందర్ రెడ్డి, నరేష్ గౌడ్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఉద్యోగులు పాల్గొన్నారు