కొండలు.. లోయలు.. దట్టమైన అడవులు.. రహదారి సౌకర్యం అంతంతమాత్రమే. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకోవాలంటే గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి. వైద్య పరీక్షల కోసం నమూనాలు పంపాలన్నా, మందులు.. వ్యాక్సిన్లు తెప్పించుకోవాలన్నా దూరం పెద్ద అడ్డంకిగా మారేది. ఇప్పుడు సాంకేతికత ఆ దూరాన్ని తగ్గిస్తోంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను వేగంగా అందించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ విధానంతో సత్ఫలితాలు సాధిస్తోంది