Kaizer News

నిరుద్యోగం రయ్‌ రయ్‌!

నిరుద్యోగం రయ్‌ రయ్‌!

· State - Telangana · sakshi.com

పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే నివేదిక వెల్లడి అటు ఉపాధి లేక ఇటు నిరుద్యోగ భృతి అందక యువత సతమతం సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగంలో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య నిరుద్యోగంలో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. అంతేకాదు.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో నిరుద్యోగితతో పోల్చితే ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు భారీగా పెరిగింది. ఈ విషయాన్ని లేబర్‌ ఫోర్స్‌ సర్వే నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య ఏపీలో నిరుద్యోగిత 6.1 శాతం ఉంటే... ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య నిరుద్యోగిత 7.5 శాతానికి పెరగడం గమనార్హం. అంటే నిరుద్యోగం 1.4 శాతం మేర పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో నిరుద్యోగిత ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. జాతీయ స్థాయిని మించి.. » జాతీయ స్థాయిలో నిరుద్యోగిత 5.4 శాతం ఉండగా, రాష్ట్రంలో 7.5 శాతం నిరుద్యోగిత నమోదైంది. » రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 7.4 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 7.7 శాతం ఉంది. » పురుషుల కంటే మహిళల నిరుద్యోగిత శాతం ఏపీలో ఎక్కువగా ఉంది. ఏపీలో మహిళల నిరుద్యోగిత 9.3 శాతం ఉండగా, పురుషుల నిరుద్యోగిత 6.4 శాతం ఉంది. » గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగిత 6.6 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 6.1 శాతం ఉంది. » మహిళల నిరుద్యోగిత గ్రామీణ ప్రాంతాల్లో 8.6 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 11.1 శాతం ఉంది. సర్వే సాక్షిగా తేలిన నిజం.. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా హామీని నెరవేర్చకుండా నిరుద్యోగ భృతికి ఎగనామం పెట్టారు. దీంతో రాష్ట్రంలో యువతకు ఉపాధి లభించడం లేదు. నిరుద్యోగిత భారీగా పెరిగిపోతోంది. ఇదే విషయం లేబర్‌ ఫోర్స్‌ సర్వే సాక్షిగా వెల్లడైంది. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News