Shorts చీరాల: తీరంలోని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో అంటకాగడం కారణంగా వందల కోట్ల విలువ చేసే భూములు చేతులు మారుతున్నాయని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు.శుక్రవారం పట్టణంలో క్రిస్టల్ మార్ట్ సముదాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడారు. పర్యాటకరంగం అభివృద్ధి చెందిన క్రమంలో తీరంలోని భూములు ఖరీదయ్యాన్నారు.దింతో నిబంధనలకు విరుద్ధంగా రామాపురంలో కోట్ల విలువ చేసే సుమారు 26 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబదించిన రికార్డ్ లను తారుమారు చేశారన్నారు.పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం ఇందులో ప్రాత్రధారులాగా వ్యవహరించారన్నారు.ఇలాంటి భూ దందాలకు సంబందించిన అనేక రుజువులు దగ్గరున్నాయని స్వష్టం చేశారు.భూ అక్రమాల ఫై ఉన్నతాధికారులను కలుస్తామన్నారు. మరోవైపు తీరంలో పర్యావరణ హితంగా నిర్మాణాలను పోత్సహించాల్సిన అధికారులే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు.కోస్టల్ రెగ్యులేషన్ జోన్ , నో డవలప్మింట్ జోన్ లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధనలు ఉన్నపటికీ ఇందుకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.కటారివారిపాలెం బాల అనే వ్యక్తికి చెందిన ఓ ప్రవేట్ రిసార్డ్స్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని , అనుమతి పత్రాలలో సైతం సర్వేనెంబర్లను తప్పుగా చూపించి అధికారులను సైతం తప్పుదోవపటించారాన్ని ఆరోపించారు.సంబందిత రిసార్ట్ నిబంధనలు వీల్లంఘించి నిర్మించారని నిర్దారిస్తూ సాక్ష్యాత్తు జిల్లా కలెక్టరే వివరణ ఇచ్చారని చెప్పేరు.ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా పర్యావరణానికి హానికలిగించే అక్రమ నిర్మాణాల ఫై ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని డిమేండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతూ వందల ఎకరాల అక్రమ లై అవుట్స్ వెలుస్తుంటే అధికారయంత్రాంగం నిమ్మకునీరెక్కినట్లు వ్యవహరిస్తుందన్నారు.ఎకరానికి కనీసం 40 శాతం భూమిని స్థానిక అవసరాలకు వదలాల్సి ఉండగా ,, 10 శాతం కూడా వదలకుండా నింబంధనలకు విరుధంగా అక్రమ వెంచర్లు వేస్తున్నారన్నారు.ఇందులో ఎకరానికి ఇంత నగదు అన్ని చేతులు మారుతున్నాయని ఆరోపించారు .ఇందులో అధికారులు పాత్ర కూడా ఉందన్నారు. ఇక రామాపురంలో సాలిడ్ వెస్ట్ మేనెజ్మింట్ యూనిట్ అనేది చీరాల మునిపాలిటీలోని లక్ష మంది జనాభా కు సంబందించిన ఆరోగ్యానికి సంబంధించిన అంశమన్నారు.ఈ యూనిటీ కు అప్పట్లోనే సుమారు 9 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అనేక నూతన పరికరాలను తెప్పించి చెత్త ద్వారా సంపద ప్రజా ఆరోగ్యాన్ని కాపాడమన్నారు .ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛాసర్వేక్షణలో చీరాల మున్సిపాలిటీకి జాతీయ స్థాయి అవార్డు ను అందుకున్న విషయాన్ని ఆమంచి గుర్తిచేశారు .కానీ నేడు అదే యూనిట్ ను అధికారుల పర్యవేక్షణ లోపంతో మరుగున పడిందన్నారు అటువంటి యూనిట్ ను సక్రమంగా వినియెగించకపోగా గుంటూరు, విజయవాడ చేతను తరలిస్తున్నామనే చెప్పుకొస్తున్నారని ,, తద్వారా ప్రజాధనం దుర్వినియెగం అవుతుందన్నారు .ఇక్కడ నుంచి పంపించే మరో చోటకి తరలించడం ద్వారా అక్కడ జరిగే ప్రక్రియకు ప్రాసెసింగ్ చార్జీలు , వాహనాల డీజిల్ ,మ్యాన్ పవర్ అంత కూడ