Kaizer News

Harish Rao | కేసీఆర్ మీద బురద జల్లితే రైతులకు న్యా

Harish Rao | కేసీఆర్ మీద బురద జల్లితే రైతులకు న్యాయం జరుగుతుందా…? సీఎం రేవంత్‌పై హరీశ్‌ రావు ఫైర్‌

· State - Telangana · ntnews.com

Harish Rao | రాష్ట్రంలో చాలా సర్వేలు సాగుతున్నాయని అన్ని సర్వేలు కేసీఆర్‌కే జై అంటున్నాయి. ఇందులో భాగానే ఈ రోజు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్‌లో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. రైతుల పాలన పోయి రాక్షసుల పాలన సాగుతున్నది.2 గంటల కరెంటు నాసిరకం వస్తే పంటలు ఎండిపోతున్నాయి.3 పంటలకు రైతు బంధు ఎగనామం పెట్టారు.కరోనా వచ్చినా కేసీఆర్ పాలనలో రైతు బంధు ఆగలే. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు చేసి దేవుడినే మోసం చెందిన ఘనుడు రేవంత్ రెడ్డి అన్నారు. బస్తాకు రెండు కిలోల తరుగు పెట్టాడు. అసెంబ్లీలో మాటలకే పరిమితమయ్యాడన్నారు. ఎలినినో పేరుతో రైతులను పూర్తిగా విస్మరిస్తున్నారు. కృష్ణా నదిలో నీళ్లు వచ్చినా ఎందుకు సాగు నీళ్లు ఇవ్వడం లేదు. ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లు. సాగునీటి ప్రాజెక్టు మోటర్లు ఆన్ చేయడం లేదు. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. బొగ్గు సరఫరా లేదని రైతులకు కరెంట్ సరఫరా నిలిపివేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను బంద్ చేసి నీటిని సరఫరా చేయడం లేదు. ఉచిత విద్యుత్ ఇవ్వడం రేవంత్ రెడ్డి ఇష్టం లేదు.. కరెంట్ సరఫరా రావడం లేదని ఎగిరిన కోమటిరెడ్డి ఎప్పుడు ఎందుకు మాట్లాడుతలేవు. ఎందుకు సబ్ స్టేషన్ లాక్ బుక్కలు చూడటం లేదన్నారు.. 22 ఏ లో పెట్టీ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదు. లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టావు రేవంత్ రెడ్డి. నేను ప్రశ్నిస్తే నా సంగతి చూస్తానంటావ్.. పిట్ట బెదిరింపులకు భయపడ.. నీ అంతూ చూస్తానని హరీశ్ రావు హెచ్చరించారు.. 420 హామీల అమలయ్యే వరకు వదిలిపెట్టం.బాండ్ పేపర్లు ఇచ్చి ఓట్లను వేసుకున్నారు.గొర్ల పంపిణీ ఏమైంది బీర్ల అయిలయ్య.. ఎందుకు మాట్లాడుతలేవు.30 లక్షల విద్యార్ధులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఎగనామం పెట్టారు.1 లక్ష 25 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక చెరువును తోడారా..? ఒక కాలువను బాగు చేశారా.భూముల కబ్జాకు రేవంత్ రెడ్డి పాడుతున్నారు.మా ప్రభుత్వం.. మీ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు జడ్జితో విచారణకు రావాలంటే తోక ముడిచారన్నారు. కృష్ణా వాటా, రీజినల్ రింగు రోడ్డు మీద కేంద్రం మీద పోరాటం చేయాలని ఎంపీలకు సవాల్‌ విసిరిన హరీశ్‌ రావు.. దమ్ముంటే రండి మీ నియోజకవర్గంలో రాత్రి పూట సబ్ స్టేషన్‌కు వెళ్లి చూద్దాం.. అంటూ ఎంపీ, ఎమ్మెల్యేలను చాలెంజ్ చేశారు.ప్రభుత్వాన్ని నడుపలేక ఏం చేయాలో రేవంత్ రెడ్డికి పాలు పోతలేదు.30 శాతం కమీషన్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంకేసీఆర్ సావు కోరుతారా..?ఆయన కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించు.గ్రామాల్లో కంటి వెలుగు పథకం నిలిపివేశారు. కేసీఆర్ మీద బురద జల్లితే రైతులకు న్యాయం జరుగుతుందా..? పాలన చేతగాకపోతే ముక్కు నెలకు రాసి ప్రజలకు క్షమాపణలు చేయి. తప్పులు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టం.. రాసిపెట్టుకో బీర్ల అయిలయ్య, రేవంత్ రెడ్డి

Original source: ntnews.com
Read more on Kaizer News