Kaizer News

Nalgonda: బాలికల జూనియర్ కాలేజీ సైన్స్ ల్యాబ్‌కు మ

Nalgonda: బాలికల జూనియర్ కాలేజీ సైన్స్ ల్యాబ్‌కు మోక్షం: కలెక్టర్ తనిఖీ

· State - Telangana · hmtvlive.com

Shorts Nalgonda: నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సైన్స్ ల్యాబ్‌కు త్వరలోనే మహర్దశ పట్టనుంది. ల్యాబ్ భవనం పాతబడి, పైకప్పు పెచ్చులు ఊడుతుండటంతో నూతన ల్యాబ్ మంజూరు చేయాలని గురువారం 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం' సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విద్యార్థినులు విన్నవించారు. ​స్పందించిన మంత్రి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుక్రవారం కళాశాలను సందర్శించారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డితో కలిసి సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థినుల భద్రత, సౌకర్యార్థం ల్యాబ్‌కు వెంటనే మరమ్మతులు చేపడుతామని కలెక్టర్ తెలిపారు. అందుకు తగిన అంచనాలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను పురమాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి దశ్రూనాయక్, ప్రిన్సిపల్ పద్మ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News