Kaizer News

కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు

కాప్రా చెరువులో నిమజ్జనాలు వద్దు

· State - Telangana · sakshi.com

కాప్రా చెరువును పరిశీలిస్తున్న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హైదరాబాద్‌: జీవ వైవిధ్యానికి ప్రతీకగా, నగర పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వెట్‌ల్యాండ్‌గా గుర్తింపు పొందిన కాప్రా చెరువులో గణేష్‌ నిమజ్జనాలకు వెసులుబాటు లేదని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన కాప్రా చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం భాగ్యనగర్‌ ఉత్సవ సమితి స్థానిక ప్రతినిధులతో మాట్లాడి పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గణనాథుల నిమజ్జనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కాప్రా చెరువు అర్బన్‌ వెట్‌ల్యాండ్‌ జాబితాలో ఉందని, ఇక్కడి జీవవైవిధ్యం, పక్షల ఆవాసాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఆ్రస్టేలియా, యూరప్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి 470కిపైగా వలస పక్షులు ఇక్కడికి వస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాప్రా లేక్‌ రివైవల్‌ గ్రూప్‌ ప్రతినిధులు హైడ్రా కమిషనర్‌ను కలిసి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. ఉప్పల్‌ జోనల్‌ కమిషనర్‌ రాధిక గుప్తా, హైడ్రా ఏసీపీ ఉమా మహేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: తెలంగాణకు రెయిన్‌ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు) ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) 'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా? ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..! 2 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా.. సాదిక్ ఖాన్ పాత్రపై పోలీసుల దర్యాప్తు

Original source: sakshi.com
Read more on Kaizer News