Kaizer News

Kaviti: ఆర్.బెలగాంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Kaviti: ఆర్.బెలగాంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

· State - Telangana · hmtvlive.com

Shorts కవిటి: కవిటి మండలం ఆర్ బెలగాం కొండివీధిలో వినాయక చవితి ఉత్సవాలను ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం బొజ్జగణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమానికి జడ్పీ ఛైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఇచ్ఛాపురం ఎంపీపీ బోర పుష్ప, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, వైసీపీ కవిటి మండల అధ్యక్షుడు కడియాల ప్రకాశ్ హాజరై గణనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం రాధాకృష్ణ కోలాట బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కోలాటం గురువు తిప్పన ధనుంజయ్ రెడ్డి, ఇచ్ఛాపురం ఎంపీపీ బోర పుష్పను గణేష్ మండపం ఆవరణలో ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మెలిగి సుఖసంతోషాలతో ఉండాలని జడ్పీ ఛైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆకాంక్షించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News