Kaizer News

11వ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు ప్రారంభ

11వ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు ప్రారంభం

· State - Telangana · prabhanews.com

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు రాష్ట్ర స్థాయి పోటీలు వేదిక : సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలో 11వ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలకు గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ.. కమ్మర్‌పల్లి గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహిస్తున్న 11వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలికల అంతర్ జిల్లా పోటీలను గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ గ్రామీణ ప్రాంత క్రీడాకారులలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని, ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు వారి నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి గొప్ప వేదికలని కొనియాడారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా, మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణకు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, క్రీడా స్ఫూర్తితో రాణించి తమ గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఇలాంటి ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక దృఢత్వంతో పాటు సామాజికంగా కూడా విద్యార్థులు అభివృద్ధి చెందుతారని అన్నారు.విద్యార్థులు ప్రతిరోజూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. కమ్మర్‌పల్లిలో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు నిర్వహించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి కే. శోభన్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి, ఈ నెల 27 నుండి 30 వరకు మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు అత్యధికంగా పాల్గొననున్నట్లు తెలిపారు.ఈ టోర్నమెంట్లో 22 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, గ్రామ ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పరిశీలకులు మరియు జిల్లా డివైఎఫ్ఓ బి. పవన్ కుమార్, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ పరిశీలకులు యాసిన్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బి. మల్లేష్ గౌడ్, స్థానిక ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శులు ఎం. సుజాత, చిప్ప నవీన్, సీనియర్ క్రీడాకారులు రాహుల్, సాగర్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News