జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ అభివృద్ధి పనులపై శనివారం మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో అవసరమైన నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రజలకు నీరు అందించడం, నూతన వాటర్ ట్యాంక్, పైప్‌లైన్ల నిర్మాణం, పారిశుద్ధ్యంపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఎస్ఈ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, డీఈ వరుణ్, ఏఈలు దీపక్, రాహుల్, దివ్య తదితరులు పాల్గొన్నారు