Kaizer News

Asian Games 2026: భారత్-శ్రీలంక మధ్య తుది పోరు.. ఒ

Asian Games 2026: భారత్-శ్రీలంక మధ్య తుది పోరు.. ఒకవేళ వర్షం పడితే గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారో తెలుసా?

· Sports · tv9telugu.com

Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ టోర్నమెంట్‌లో భారత మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ఫైనల్ పోరుకు దూసుకెళ్లింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో పవర్‌ఫుల్ బ్యాటింగ్‌తో చెలరేగిన టీమిండియా బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసి తుది పోరులో అడుగుపెట్టింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు శ్రీలంకతో బంగారు పతాకం కోసం అమీతుమీ తేల్చుకోనుంది. అయితే జపాన్‌లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఈ వేదికపై కొన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయినందున, ఫైనల్ రోజు వాతావరణం ఎలా ఉంటుందనే టెన్షన్ అభిమానులలో నెలకొంది. సాధారణంగా ఐసీసీ నిర్వహించే పెద్ద టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్‌లలో వర్షం పడితే రిజర్వ్ డే కేటాయిస్తారు. కానీ ఆసియా క్రీడల క్రికెట్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్‌కు ఎలాంటి రిజర్వ్ డే అందుబాటులో లేదు. ఒకవేళ అనుకోకుండా వర్షం కారణంగా భారత్ అలాగే శ్రీలంక మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండా రద్దయితే, విజేతను ఎలా నిర్ణయిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ప్రత్యేక పరిస్థితిలో టోర్నమెంట్ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న జట్టుకు విజయం తలకట్టను కట్టనున్నారు. ప్రస్తుత ఐసీసీ మహిళా టీ20 ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే, భారత జట్టు అగ్రస్థానాల జాబితాలో ఎంతో పటిష్టంగా మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు శ్రీలంక జట్టు ఆరో స్థానంలో ఉంది. ఈ కారణంగా ఒకవేళ ఫైనల్ మ్యాచ్ పూర్తిగా వర్షార్పణం అయి రద్దయినట్లయితే, మెరుగైన ర్యాంక్ కలిగిన కారణంగా టీమిండియాను అధికారిక విజేతగా ప్రకటించి గోల్డ్ మెడల్ అందజేస్తారు. శ్రీలంక జట్టు సిల్వర్ మెడల్‌తో సంతృప్తి చెందాల్సి వస్తుంది. గతంలో లీగ్ దశలో కొన్ని మ్యాచ్‌లు కూడా ఇలాగే నిర్ణయించబడటం గమనార్హం. మరోవైపు ఫైనల్‌కు ముందు సెమీఫైనల్స్‌లో ఓటమి చవిచూసిన పాకిస్థాన్ అలాగే బంగ్లాదేశ్ జట్లు కాంస్య పతకం కోసం ముఖాముఖి తలపడనున్నాయి. మూడో స్థానం కోసం జరిగే ఈ హోరాహోరీ పోరులో గెలిచిన జట్టుకు బ్రాంజ్ మెడల్ దక్కుతుంది. ఏదేమైనప్పటికీ భారత మహిళా జట్టు ఈసారి ఎలాగైనా అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థిని ఓడించి నేరుగా స్వర్ణ పతకాన్ని ముద్దాడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Original source: tv9telugu.com
Read more on Kaizer News