Kaizer News

అసమర్థ పాలన అస్తవ్యస్తమైన రాష్ట్రం

· State - Telangana · ntnews.com

2026 సెప్టెంబర్‌ 2 నాటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి వెయ్యి రోజులు కానున్న నేపథ్యంలో తెలంగాణ బతుకు చిత్రం పూర్తిగా తలకిందులైంది. ఉమ్మడి రాష్ట్రం లో వివక్షను ఎదుర్కొని, 60 ఏండ్ల పోరాటం తర్వాత 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను తెచ్చింది కేసీఆర్‌, నిలబెట్టింది కేసీఆర్‌, దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిపింది కేసీఆర్‌ అని ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఉన్నది. తొమ్మిదిన్నరేండ్లపాటు సాగునీరు, తాగునీరు, కరెంటు, సంక్షేమంతో బంగారు తెలంగాణను చూపించారు. కానీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు, 420 హామీల మాయాజాలంతో రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ అవకాశాన్ని ప్రజల కోసం కాకుండా తమ స్వలాభం కోసం వాడుకోవడంతో తెలంగాణ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణ స్థితికి దిగజారిపోయింది

Original source: ntnews.com
Read more on Kaizer News