Kaizer News

Tamil Nadu Governor Kiran Kumar: మాజీ సీఎం నల్లారి

Tamil Nadu Governor Kiran Kumar: మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించారా?

· State - Telangana · telugu.abplive.com

మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించారనే విషయం జోరుగా ప్రచారంలో ఉంది. ఏకంగా ఆయనకు సోషల్ మీడియా యూజర్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆయన్ని అభినందిస్తూ పోస్టర్లు కూడా షేర్ చేస్తున్నారు. అయితే వాస్తవంగా అలాంటిదేమీ జరగలేదని అధికారిక వర్గాలు చెబుతున్నారు. ఇదంతా సోషల్ మీడియా సృష్టేనని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారనే ప్రచారం జోరందుకుంది. తమిళనాడు సీఎం విజయ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉందని అందుకే ఆయన్ని ఎన్డీఏలోకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఆ రాష్ట్ర గవర్నర్‌గా కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్రం పంపించిందని జరుగుతున్న ప్రచార సారాంశం. తమిళనాడు గవర్నర్ గా నియమితులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు pic.twitter.com/7UHj176eBV ఏదైనా రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను రాష్ట్రపతి నియమిస్తారు. దీనిపై అధికారిక ఉత్తర్వుల ద్వారా కేంద్రానికి తెలియజేస్తారు. ఆ తర్వాత ఎవర్ని ఏ రాష్ట్రానికి నియమించారనేది తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రపతి ఆఫీస్‌ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా పుకార్లు మాత్రమేనంటున్నారు. అటు కిరణ్ కుమార్ రెడ్డి వర్గం కూడా దీనిపై స్పందించడం లేదు. ప్రస్తుతం ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారని చెబుతున్నారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా కొన్ని రాష్ట్రాలకు గవర్నర్‌లను మార్చే ఛాన్స్ ఉందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేశాయి. అందులో కిరణ కుమార్ రెడ్డి పేరు కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో ఆయనకు గవర్నర్ పదవి వచ్చేసిందని ప్రచారం మొదలైపోయింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ఉన్నందున ఆయనకు కచ్చితంగా పదవి ఇవ్వాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. భవిష్యత్‌లో గవర్నర్ పదవి ఇవ్వవచ్చేమో కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయనకు గవర్నర్ పదవి వచ్చినట్టు ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదు. జరుగుతున్నదంతా ఫేక్ ప్రచారమే. Up Next Up Next Up Next Up Next అరకు లోయలో సంజీవని ప్రాజెక్టు ప్రారంభం! గేమ్ ఛేంజర్‌ అవుతుందన్న ఏపీ సీఎం చంద్రబాబు! హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ తిరుపతి మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించారా? నిజామాబాద్ ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు- డీసీసీ అధ్యక్షుడిపై బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ తిరుగుబాటు! హైదరాబాద్ హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ! విశాఖపట్నం విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో నలుగురు ఆత్మహత్య! ఆటో డ్రైవర్ కుటుంబంలో విషాదం! హైదరాబాద్ హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్! ఫాస్టాగ్ నుంచే నేరుగా ఈ-చలాన్ కట్‌! ఇండియా బోరున ఏడుస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత! పాలిటిక్స్ లోకల్ పోల్స్ బరిలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - డైరక్ట్ ఎలక్షన్స్‌ అడ్వాంటేజ్‌గా సాహసం చేస్తారా? ఓటీటీ-వెబ్‌సిరీస్

Original source: telugu.abplive.com
Read more on Kaizer News