అమరావతి: ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే దానికి రాజకీయ రంగు పులమడం సరికాదని ఏపీ జేఏసీ అమరావతి స్పష్టం చేసింది. ఉద్యోగుల హక్కుల కోసం ప్రశ్నించడం, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం ప్రభుత్వాన్ని అవమానించడం లేదా కించపరచడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున మంత్రి చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు అన్నారు. విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, టి.వి. ఫణి పేర్రాజు, పారే లక్ష్మి, పొన్నూరు విజయలక్ష్మి తదితరులు మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలే తమకు ప్రధానమని, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కారం కోసం పోరాడటం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. రాజకీయ అజెండా కాదు.. ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యం ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రశ్నించడం రాజకీయ అజెండాగా ఎలా మారుతుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తమ సంఘానికి గతంలోనూ, ఇప్పుడూ ఉద్యోగుల ప్రయోజనాలే ఏకైక అజెండా అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, ప్రభుత్వాన్ని అవమానించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. ఎవరు అధికారంలో ఉన్నారన్నది తమకు ప్రాధాన్యం కాదని, అధికారంలో ఉన్న ప్రభుత్వంతోనే ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరుపుతామని తెలిపారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకుండానే అనేక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిన సందర్భాలను గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ అంశాలను పుస్తక రూపంలో ప్రచురించామని వివరించారు. 2022-23లో ఉద్యోగ సంఘాలు ఐక్యంగా నిర్వహించిన ఉద్యమాలను కూడా జేఏసీ నాయకులు గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ప్రభుత్వం చర్చలు జరిపిందన్నారు. అయితే చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి ఒంటరిగా 92 రోజుల పాటు ఉద్యమం నిర్వహించిందని చెప్పారు. ఆ ఉద్యమం సందర్భంగా కూడా అనేక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకున్నామని తెలిపారు. దశాబ్దాలుగా రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయని, గతంలో ఎవరూ వాటికి రాజకీయ రంగు పులమలేదన్నారు. ప్రస్తుతం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సమయంలో వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ వ్యాఖ్యలు చేయడం తమ విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఆగస్టు 28న నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వీడియో రూపంలో గుర్తు చేశామని బొప్పరాజు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరడమే తమ ఉద్దేశమని, ప్రభుత్వాన్ని కించపరచడం లేదా అవమానించడం తమ లక