Kaizer News

స్టేట్‌ లెవెల్‌ స్కేటింగ్‌ పోటీలకు లోకేశ్వర్‌

స్టేట్‌ లెవెల్‌ స్కేటింగ్‌ పోటీలకు లోకేశ్వర్‌

· Sports · ntnews.com

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రస్థాయి అండర్‌ 17 స్కేటింగ్‌ పోటీలకు హైదరాబాద్‌ విద్యార్థి చిట్టా లోకేశ్వర్‌ ఎంపికయ్యాడు. శనివారం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన హైదరాబాద్‌ డిస్ట్రిక్ట్‌ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ పోటీల్లో లోకేశ్వర్‌ మూడు విభాగాల్లో పోటీపడి బంగారు, వెండి, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు. భారతీయ విద్యాభవన్‌ పబ్లిక్‌ పాఠశాల (విద్యాశ్రమ్‌)లో 10వ తరగతి చదువుతున్న లోకేశ్వర్‌ను ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ అరుణశ్రీ ప్రత్యేకంగా అభినందించారు

Original source: ntnews.com
Read more on Kaizer News