Kaizer News

కరీంనగర్‌ చేపలకు డిమాండ్‌.. ప్రధాన నగరాల నుంచి బుక

కరీంనగర్‌ చేపలకు డిమాండ్‌.. ప్రధాన నగరాల నుంచి బుకింగ్‌లు

· State - Telangana · ntnews.com

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ): సముద్ర తీరం లేకపోయినా చేపల ఉత్పత్తిలో కరీంనగర్‌ జిల్లా మంచినీటి చేపలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉన్నది. లోయర్‌ మానేరుడ్యామ్‌, మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో లభించే మంచినీటి చేపలకు దేశంలోని ప్రధాన నగరాల ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు మత్స్యకారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇకడ లభించే రవ్వ, బొచ్చ, జెల్లలు వంటి రకాలకు వందల టన్నుల్లో ఆర్డర్లు వెల్లుతున్నట్టు వెల్లడిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి వరద కాలువ, మానేరు నదుల్లో మత్స్యకారుల వలలకు 20కిలోల నుంచి 35 కిలోల వరకు భారీ చేపలు చికుతుండగా, ఈ పెద్ద చేపలను మారెట్లో ఒకోటి రూ.3,000 నుంచి రూ. 5,000పైగా విక్రయిస్తున్నుట్టు పేర్కొంటున్నారు. చేపల ప్రియులు ఎంతో ఇష్టంగా తినే కొరమీను చేపల ఉత్పత్తికి కరీంనగర్‌ను ప్రధాన కేంద్రంగా మార్చేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌ హయాంలోనే బాటలు వేశారు. పెన్‌కల్చర్‌తో మంచినీటి చేపల పెంపకంలో కొరమీను పెంపకానికి ప్రాధాన్యత కల్పించారు. రాష్ట్ర చేపగా గుర్తించిన ఈ రకం చేపలు రెండేండ్లలోనే ఉత్పత్తిలో మంచి ఫలితాలు సాధించి, మత్స్యకారులకు లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో తెలంగాణ మత్స్యశాఖ వీటి పెంపకాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులను తగ్గించి, ఇకడే స్థానికంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది

Original source: ntnews.com
Read more on Kaizer News