హసన్‌పర్తి, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా జీడబ్ల్యూఎంసీ 65వ డివిజన్ దేవన్నపేటకు చెందిన నిరుపేద నందిపాక కుమార్‌కు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అండగా నిలిచారు. కుమార్ కాలు శస్త్రచికిత్స కోసం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను సంప్రదించగా ఆయన స్పందించారు. కుమార్ చికిత్స నిమిత్తం రూ.1.50 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరుకు ఎమ్మెల్యే చొరవ తీసుకున్నారు. మంజూరైన ఎల్ఓసీ పత్రాన్ని ఆదివారం కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ మెరుగైన వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని కుమార్‌కు సూచించారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో తమను నమ్ముకున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందించి తమకు తోడుగా నిలిచిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 65వ డివిజన్ అధ్యక్షుడు సునీల్, కాంగ్రెస్ నాయకుడు పొలపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు