Kaizer News

Palasa: పలాసలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చే

Palasa: పలాసలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీష!

· State - Telangana · hmtvlive.com

Palasa: పలాస పార్టీ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేశారు.ఈ సందర్భంగా దేవునల్తాడ గ్రామానికి చెందిన సోడిపిల్లి లక్ష్మి కుటుంబానికి రూ.81,000, ఉద్దానం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన చింత వెంకటేష్ కుటుంబానికి రూ.1,42,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గౌతు శిరీష అందించారు. అనారోగ్యం, వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్ గోవిందు పాపారావు, టీడీపీ నాయకులు తులే అప్పోజీ, చింత నారాయణ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News