Kaizer News

Hanumakonda: వీర వల్భాపూర్‌లో పర్యటించిన మంత్రి పొ

Hanumakonda: వీర వల్భాపూర్‌లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

· State - Telangana · hmtvlive.com

హనుమకొండ: హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలోని వీర వల్భాపూర్ గ్రామంలో నిర్వహించిన “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజా పాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సమక్షంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ ప్రజల నుంచి వ్యక్తిగత, సామూహిక సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధి వివరాలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. - గ్రామంలో 13 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, చాలావరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో రెండో దశలో మరిన్ని ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగనుంది. - 233 మందికి పెన్షన్లు అందుతుండగా, రూ.5.55 లక్షలు విడుదల అవుతున్నాయి. - గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో 349 కుటుంబాలకు రూ.34.07 లక్షల లబ్ధి చేకూరింది. - మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ ద్వారా 331 కుటుంబాలకు రూ.6.72 లక్షలు విడుదలయ్యాయి. - 41 స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.32.38 లక్షలు విడుదలయ్యాయి. - 41 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.6.20 కోట్ల రుణాలు అందాయి. - ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్టీల్ బ్యాంక్ కార్యక్రమంలో భాగంగా 600 కిట్ల చొప్పున 13 రకాల వస్తువులు అందించారు. - 176 మంది రైతులకు రూ.13.73 కోట్ల మేర రుణమాఫీ ప్రయోజనం అందింది. - 464 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.16.86 కోట్లు అందాయి. - రైతు బీమా కింద 7 మంది రైతుల కుటుంబాలకు రూ.35 లక్షలు అందించారు. - 87 మంది రైతులకు సన్న వడ్ల బోనస్ కింద రూ.24.87 లక్షలు విడుదలయ్యాయి. - 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. - గ్రామంలోని 1,771 రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. - భూభారతి కింద 79 దరఖాస్తులు నమోదయ్యాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ ప్రజలు కాలువ నిర్మాణం పూర్తి చేయడం, మహిళా సంఘాల భవనానికి స్థల సమస్య పరిష్కరించడం, వ్యవసాయ పొలాలకు వెళ్లే రహదారుల నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, సర్వీస్ రోడ్డు విస్తరణ తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళా భవనానికి స్థల సమస్య వెంటనే పరిష్కరించాలి వల్భాపూర్ గ్రామంలో మహిళా భవనానికి స్థల సమస్య చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉందని మంత్రి తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. స్థల సమస్య పరిష్కారం కాగానే మహిళా భవనాన్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జలసిరి పథకం కింద ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మంత్రి సూచించారు. ఒక్కో ఇంకుడు గుంతకు ప్రభుత్వం రూ.6,500 అందిస్తుందని, పొలం కుంటకు రూ.

Original source: hmtvlive.com
Read more on Kaizer News