Kaizer News

Yanamalakuduru: యణమలకుదురులో రహదారి నిర్మాణ పనులకు

Yanamalakuduru: యణమలకుదురులో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన!

· State - Telangana · hmtvlive.com

Shorts Yanamalakuduru: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని యణమలకుదురు గ్రామంలో చేపల మార్కెట్ నుంచి ఆర్సిమ్ చర్చ్ వరకు రహదారి నిర్మాణానికి ₹38.53 లక్షల సాధారణ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు శంకుస్థాపన చేశారు. ప్రజల రోజువారీ రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన రహదారులు, మెరుగైన డ్రైనేజీ,అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం, ప్రాంతీయ మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు. తాడిగడప మున్సిపాలిటీలో నిరంతర అభివృద్ధి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 26 నెలల్లో తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని,మిగిలిన ప్రజా అవసరాలను కూడా గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తామని బోడే ప్రసాద్ గారు పేర్కొన్నారు. ప్రజల అవసరాలే మా ప్రాధాన్యత..ప్రతి ప్రాంత అభివృద్ధే మా లక్ష్యం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వం,సహకారంతో పెనమలూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,అధికారులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News