Kaizer News

Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్

· State - Telangana · ntvtelugu.com

Tata Aeris: టాటా మోటార్స్ తన కాంపాక్ట్ సెడాన్ కార్ అయిన టిగోర్‌ను సరికొత్త అవతారంలో ఒక కొత్త పేరుతో మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మామూలుగా చిన్న చిన్న మార్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌గా అమ్మడం కాకుండా, దీనికి "టాటా ఏరిస్" (Tata Aeris) అనే కొత్త పేరుతో ఒక సరికొత్త గుర్తింపు ఇవ్వాలని చూస్తోంది. ఈ పేరు కోసం TATA AERIS అనే ట్రేడ్‌మార్క్‌ను కూడా కంపెనీ ఇప్పటికే రిజిస్టర్ చేయించింది. ఈ కొత్త సెడాన్ కార్ 2026, సెప్టెంబర్ 25న లాంచ్ కాబోతోంది. ఈ కొత్త టాటా ఏరిస్ డిజైన్, లుక్స్ విషయంలో పెద్ద ఎత్తున మార్పులు కనిపించబోతున్నాయి. కార్ ఫ్రంట్ భాగంలో సన్నని హెడ్‌లైట్స్, బ్లాక్ కనెక్టింగ్ ఎలిమెంట్, పెద్ద స్పోర్టీ బంపర్‌ను అందించారు. ఇవి కార్‌కి వ్యాన్ లాంటి లుక్ కాకుండా మంచి స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి. కొత్త డిజైన్ ఉన్న అలాయ్ వీల్స్, కొత్త టెయిల్ లైట్స్, కొత్త రియర్ బంపర్ ఇందులో కనిపించనున్నాయి. అయితే కార్ ఓవరాల్ సెడాన్ షేప్ మాత్రం మునుపటిలాగే ఉంటుంది

Original source: ntvtelugu.com
Read more on Kaizer News