Kaizer News

శని సంచారం.. ఈ రాశుల వారికి ఏడుపు తప్ప ఏమీ లేనట్లే

శని సంచారం.. ఈ రాశుల వారికి ఏడుపు తప్ప ఏమీ లేనట్లేనంట!

· State - Telangana · tv9telugu.com

అయితే డిసెంబర్ 11న శని వక్ర గతి నుంచి బయటకు వస్తుంది. ఆ రోజు నుంచి నేరుగా సంచరిస్తుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారు చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా మూడు రాశుల వారు దీని వలన చాలా ప్రభావితం అవుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? మిథున రాశి : మిథున రాశి వారికి శని సంచారం చాలా సమస్యలను తీసుకొస్తుంది. వీరు ఆర్థికంగా నష్టపోతారు. అంతే కాకుండా ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది. ఉద్యోగం చేసే వారు ఉన్నతాధికారులు, సన్నిహితుల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటారు. శని ప్రభావంతో వీరు అన్ని విధాలుగా ఎక్కువగా నష్టాలు చవి చూసే ప్రమాదం ఉంది. సింహ రాశి : సింహ రాశి వారికి కూడా ఇది మానసిక ఆందోళనను పెంచుతుంది. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆదాయం కూడా తగ్గిపోతుంది. దూర ప్రయాణాలు నష్టాలు, అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది. కన్యా రాశి : కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కుటుంబంలో అశాంతి నెలకుంటుంది. భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదంట. అందువలన ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Original source: tv9telugu.com
Read more on Kaizer News