Kaizer News

Tiruvuru: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు: తిరువూ

Tiruvuru: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు: తిరువూరులో విషాదం

· State - Telangana · hmtvlive.com

Shorts ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు పట్టణానికి చెందిన వీరంకి చెన్నకేశవరావు అనారోగ్యంతో మృతి. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరైన ఏకైక కుమార్తె యామినిరాధ. “నాన్నా.. నన్ను వదిలేసి ఎలా వెళ్లావు నాన్నా” అంటూ గుండెలవిసేలా రోదన. కుమారులు లేకపోవడంతో తండ్రికి తలకొరివి పెట్టిన ఏకైక కుమార్తె. తండ్రి పార్థివదేహం ముందు కుప్పకూలిన యామినిరాధ. కూతురి కన్నీటి రోదనతో విషాదంగా మారిన తిరువూరు స్వర్గపురి. తండ్రికి తానే కొడుకుగా మారి అంతిమ సంస్కారాలు నిర్వహించిన యామినిరాధ. తండ్రి చివరి ప్రయాణంలో కన్నీటితో అడుగులు వేసిన కుమార్తె. కూతురి రోదన చూసి కంటతడి పెట్టిన బంధుమిత్రులు, స్థానికులు. “తండ్రికి కూతురిగా చివరి వీడ్కోలు.. కొడుకుగా తలకొరివి పెట్టిన కుమార్తె యామినిరాధ”

Original source: hmtvlive.com
Read more on Kaizer News