Kaizer News

ఆనంద్‌ ఆల్‌రౌండ్‌ షో

ఆనంద్‌ ఆల్‌రౌండ్‌ షో

· State - Telangana · ntnews.com

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: తెలంగాణ డీజీపీగా ప్రమోట్‌ అయ్యాక తాను ఆడిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో సీవీ ఆనంద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టారు. హెచ్‌సీఏ సీ-డివిజన్‌ వన్డే లీగ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా హైదరాబాద్‌ డిస్ట్రిక్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్‌ క్లబ్‌ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆయన.. 82 బంతుల్లోనే 21 బౌండరీలు, 5 సిక్స్‌లతో 126 రన్స్‌ చేశారు. అనంతరం బంతితో 5 ఓవర్లు బౌలింగ్‌ చేసి వికెట్లేమీ తీయకున్నా 3 మెయిడిన్లు వేసి 8 పరుగులిచ్చారు. డీజీపీ ఆల్‌రౌండ్‌ షోతో సికింద్రాబాద్‌ జట్టు 95 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది

Original source: ntnews.com
Read more on Kaizer News