Kaizer News

అపూర్వ రాగం 54.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూ

అపూర్వ రాగం 54.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)

· State - Telangana · ntnews.com

జరిగిన కథ తన ప్రయత్నానికి అడ్డురావద్దని ఆహవను హెచ్చరిస్తుంది భాణుసత్తి. ఈసాణుడు అవణాయరుతో సహా వామదేవుని, సౌగంధికను భయంకరమైన అడవిలో బంధిస్తాడు. పోటిసుడు.. కుసుమ శ్రేష్ఠిని కలిసి, కొన్ని గడియలపాటు బంధ విముక్తి కోసం ఒక భటునికి వేయి కార్షాపణాలు ఇవ్వాలని చెప్తాడు. మహారాజు సౌరిసంబ వద్దకు ఒక అనుమానితుణ్ని తీసుకొని వస్తారు భటులు. తర్వాత.. చిలుకవాడలో.. పెడరెక్కలు విరిచి కట్టి; చేతులకు, కాళ్లకు సంకెళ్లు తగిలించి ఒక బండి మీద మధ్యలో నిట్రాడు వంటి దూలానికి పోటిసుణ్ని కట్టేసి, పదిమంది వస్తాదులు సవరసత్తి గృహానికి తీసుకొని వచ్చినారు. ఈ విషయం ఒక పరిచారిక సవరసత్తికి తెలియజేయాలని ఆమె మందిరంలోనికి పరుగెత్తింది. అప్పటికే సవరసత్తినీ బంధించి ఉన్నారక్కడ. అయితే పోటిసుణ్ని కట్టేసినంత దారుణంగా కాకుండా, రెండు చేతులు వెనకవైపున కలిపి మణికట్టు వద్ద తాళ్లతో బంధించి ఉన్నారు. ఈసాణుని నమ్మినబంటు అలక్కుడు ఇట్లా అంటున్నాడు.. “చూడు తల్లీ! నేను రాజు చేతిలో కత్తిలాంటి వాడిని. మహారాజుల ఆజ్ఞను ఆచరణలో పెట్టడం తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేని వాణ్ని. తమరిక్కడ నిర్వహించిన కార్యకలాపాలన్నీ తెలిసి.. ఆయన తమరిని, పోటిసుణ్ని ఊరవతల మామిడి తోటలో ఒకరినొకరు చూస్తుండగా తలలు నరికి తీసుకొని రమ్మని చెప్పినారు..” “పోటిసుడా? అతనెవరు?” ఏమీ తెలియనట్లు కనుబొమలు ముడి వేసింది, కంగారును కప్పిపుచ్చుకుంటూ సవరసత్తి. “మీ గుట్టు మట్టులన్నీ మహారాజు కనిపెట్టేసినారమ్మా!” అంటూ.. ప్రశాంతంగా వివరించినాడు అలక్కుడు. “మియాంక తాతనే పోటిసుడు అన్న నిజం ఒక్కటే కాదు; అవణాయరు మందిరంలో చేరిన దేవి రూపంలోని వామదేవుడు, సుద్ది రూపంలోని సౌగంధిక, జాయప వేషంలో ఉన్న జయసేనుడు కూడా పట్టుబడ్డారు. అవణాయరుతో సహా ఆ ముగ్గురినీ మహారణ్య మధ్యంలో మట్టు పెట్టేందుకు తీసుకొని పోయినారు మహారాజు ఈసాణుల వారు” ఉలిక్కిపడింది సవరసత్తి! ‘ఎంతో పటిష్టమైన యోజనతో ముందుకెళుతున్నాం’ అనుకున్నది సవర. కానీ, ఇంత తొందరగా ఈసాణునుడికి దొరుకుతామని అనుకోలేదు! అందరూ ఒకేసారి దొరికిపోవడం మరింత బాధకు లోను చేసిందామెను. తాను నాలుగు రోజుల క్రితమే పోటిసుణ్ని చంద్రహత్థిని కలుపుతానని మాట ఇచ్చింది కూడా. పరిస్థితులు ఎందుకు ఇట్లా మారిపోయినాయి? ఎవరో తొందరపాటును ప్రదర్శించి ఉంటారు! అందుకే ఈ దుస్థితి. ఎవరు చేసి ఉంటారు??? ‘వామదేవుడు సౌగంధిక చాలా జాగ్రత్తగానే ఉంటారు; జయసేనుణ్ని శంకించడానికి లేదు; పోటిసుడు కూడా మియాంకు తాత వేషంలో బాగా ఒదిగిపోయినాడు..’ ఆమె ఆలోచనలు అవణాయరు దాకా వెళ్లలేదు. అతని భటుడు అల్లడు ఈ డొంకంతా కదలడానికి తీగగా మారినాడన్నది ఆమె ఊహకు అందలేదు. ‘ఇంకా నయం! చంద్రహత్థిని కూడా బంధించలేరు. పాపం! అన్నెం పున్నెం తెలియని అమాయకురా..’ అనుకుంటుండగానే.. “తమరినిప్పుడు ఇంతటి కుట్ర నడిపించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకొని వెళ్లవలసి ఉన్నది. పోటిసుణ్ని కూడా అక్కడికే తీసుకొని పోతున్నాం!” అన్నాడు అలక్కుడు. “ఎక్కడికి?” ఏమీ తెలియనట్లు పైకి అన్నది సవర. “మామిడి తోటలో ఉన్న భూ..గృ..హా..నికి..” ఒక్కొక్క అక్షరం వత్తి పలికినాడు అలక్కుడు. సవర కాళ్ల కింద నేల కదిలినట్లయింది. ఈసాణుడు, అతని ముఖ్య అనుచరుడు అలక్కుడు అంతఃపురంల

Original source: ntnews.com
Read more on Kaizer News