Kaizer News

సకలశాస్త్ర సమాహారం.. శ్రీకృష్టతత్వం!

సకలశాస్త్ర సమాహారం.. శ్రీకృష్టతత్వం!

· State - Telangana · ntnews.com

భారతీయ ఆధ్యాత్మిక, తాత్విక, సాంస్కృతిక చరిత్రలో శ్రీకృష్ణ తత్వం ఒక మహత్తరమైన మార్గం. శ్రీకృష్ణుడు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వేణువు, నెమలి పింఛం, రాధారాధన, గోపికలు, కురుక్షేత్ర యుద్ధం, అర్జునుడికి చెప్పిన భగవద్గీత మాత్రమే కాకుండా ఆయన చిన్నతనంలో చేసిన అల్లరిపనులు కూడా స్ఫురణకు వస్తాయి. కృష్ణుడి బాల్యంలో ఆయనలో కనిపించిన లీలాతత్వం, యౌవనంలో కనిపించిన ప్రేమ-భక్తి తత్వం, మథురలో కనిపించిన ధర్మరక్షణ, ద్వారకలో కనిపించిన రాజనీతి, కరుక్షేత్రంలో జ్ఞానబోధ ఇవన్నీ కలిపితేనే సంపూర్ణమైన కృష్ణతత్వం. శ్రీకృష్ణుడు కేవలం పురాణపురుషుడు మాత్రమే కాదు. ధర్మం, రాజనీతి, తత్వశాస్త్రం, యోగం, భక్తి, జ్ఞానం, కర్మ, మనోవిజ్ఞానం, సామాజిక బాధ్యత లాంటి అనేక శాస్ర్తాల సమాహారం. భక్తి కోణంలో ఆయన భగవంతుడు, చరిత్ర ఇతిహాస కోణంలో మహాభారతంలోని కీలక వ్యక్తి, తత్వశాస్త్ర కోణంలో గీతాచార్యుడు, నాయకత్వ కోణంలో వ్యూహకర్త, మనోవిజ్ఞాన కోణంలో సంక్షోభంలో ఉన్న అర్జునుడికి మార్గదర్శి, సామాజిక కోణంలో వ్యవస్థను, సమాజాన్ని కాపాడే నాయకుడు, ఆధునిక ఆలోచనా కోణంలో పరిస్థితిని విశ్లేషించి, భావోద్వేగాలను నియంత్రించి, అందుబాటులో ఉన్న సమాచారంతో నిర్ణయం తీసుకుని తన బాధ్యతలను నిర్వర్తించమని చెప్పే మనోవిజ్ఞానవేత్త. కృష్ణస్తు భగవాన్‌ స్వయం అని వ్యాసుడన్నట్లు కృష్ణుడు స్వయం అవతరణ. భగవంతుడే స్వయంగా మానవుడిగా వచ్చిన రూపం. శ్రీకృష్ణుడు మనకు బాగా తెలిసిన దైవం. సమాజప్రక్షాళన అతని కార్యక్రమం. మనకు ఆయనను గురించి తెలుసు అనుకుంటాం కానీ, ఆయన తత్వంలోని పరమార్థం మనకు ఏమాత్రం తెలియదు. బృందావనంలో ఆటలు, రేపల్లెలో లీలలు .. ఇలా ఇవన్నీ ఆయన 125 సంవత్సరాల దీర్ఘ జీవితంలో మొదటి 12 సంవత్సరాలు మాత్రమే కనిపిస్తాయి! కానీ, శ్రీకృష్ణుడి పాత్ర ద్వాపర యుగాంతం వరకు ఉంటుంది. ఆయన జీవితంలో ప్రతీ అంశం ఏదో ఒక శాస్త్రంతో ముడిపడి ఉన్నట్లుగా భాగవతం, భారతాలలోని పలు ఘట్టాలు చెబుతాయి. శ్రీకృష్ణుడిలోని బహుముఖాలను దర్శిస్తే ద్వారక నిర్మాణంతో వాస్తుశిల్పి, అర్జునుడి మానసిక సంఘర్షణను రూపుమాపి యుద్ధం చేయించిన సైకాలజిస్టు, తన వేణుగానంతో సకలజనులను సమ్మోహనపరిచిన సంగీతకారుడు, ఆరోగ్యం, జీవనశైలి, ఆయుర్వేద సంప్రదాయాలతో అనుసంధానమై గోవు ప్రాముఖ్యాన్ని చాటిన వైద్యుడు. ధర్మరక్షణ, యుద్ధ నిర్ణయాలతో మహా వీరుడయ్యాడు. ద్వారకపాలనతో రాజనీతిజ్ఞుడు, గోవర్ధనగిరి ఉద్ధరణ ఘట్టం, వర్షం-యుజ్ఞంపై భగవద్గీతలో చెప్పిన చర్చ వంటి వాటితో ైక్లెమటాలజిస్ట్‌. అంతేకాదు గతి, భ్రమణం, వేగం వంటి భౌతిక శాస్త్ర సూత్రాలతో సుదర్శన చక్రాన్ని నియంత్రించిన కైనెటిక్‌ ఇంజినీర్‌, ఇలా బహుముఖ ప్రజ్ఞలతో నేటి తరానికి తన జీవనాన్ని ఆదర్శంగా మలిచాడు. శ్రీకృష్ణుడు ఒక గొప్ప రాజకీయవేత్త కూడా! పాండవుల తరఫున శాంతి రాయబారిగా వెళ్లడం, యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నించడం, చివరికి ధర్మయుద్ధంలో వ్యూహాత్మకంగా మార్గనిర్దేశనం చేయడం ఆయన రాజకీయ దూరదృష్టిని చూపుతుంది. ‘వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం..’ ఆయన ముఖ్యమైన తత్వం జగద్గురు తత్వం. గీతాచార్యుడుగా ఆయన జగద్గురువయ్యాడు. ఆయన అర్జునుడికి కేవలం యుద్ధం

Original source: ntnews.com
Read more on Kaizer News