Kaizer News

విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేయాలి: మండలి బుద్ధప్రస

విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేయాలి: మండలి బుద్ధప్రసాద్

· State - Telangana · prabhanews.com

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. శనివారం అవనిగడ్డ మండలం పులిగడ్డలోని స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సిబ్బంది హాజరు, వారి పనితీరు, ఎన్టీఆర్‌ భరోసా దరఖాస్తుల నమోదు ప్రక్రియ, తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. కార్యాలయంలోని రికార్డులు, దరఖాస్తుల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. కార్యాలయం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News