ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ పాలనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఏపీ మున్సిపల్ లా సవరణ చట్టానికి గవర్నర్ ఆమోదం లభించింది. ఈ సవరణలతో స్థానిక సంస్థల పాలనలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. సవరించిన చట్టం ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ పదవుల సంఖ్యను రెండింటి నుంచి ఒకటికి తగ్గించారు. అలాగే మున్సిపాలిటీల్లో ఉన్న మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులను కూడా రెండింటి నుంచి […]