Kaizer News

తిరుపతిలోనే నెలైట్

తిరుపతిలోనే నెలైట్

· State - Telangana · prabhanews.com

తిరుపతి కేంద్రం కొనసాగింపుతో పాటు విస్తరణకు అవకాశం అమరావతిలో నెలైట్ క్వాంటమ్‌ ఏఐ కేంద్రం క్వాంటమ్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై ప్రత్యేక దృష్టి రాష్ట్రంలో మూడు నెలైట్ కేంద్రాలకు అవకాశం తిరుపతిలో ఇప్పటికే 4,308 మందికి శిక్షణ తిరుపతి బ్యూరో , ఆంధప్రభ: తిరుపతి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(నెలైట్) సెంటర్ తరలింపు అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన పేర్కొంటూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో పాటు అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా నెలైట్ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు తెలిపారు. అమరావతిలో నెలైట్ క్వాంటమ్‌ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదన రావడం రాష్ట్రంలో నెలైట్ కార్యకలాపాల విస్తరణలో కీలక ముందడుగుగా నిలుస్తుందన్నారు. అమరావతిలో కొత్త కేంద్రం ఏర్పాటవుతున్నప్పటికీ, తిరుపతిలో ఇప్పటికే కొనసాగుతున్న నెలైట్ కేంద్రాన్ని తరలించడం, మూసివేయడం కాదని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రంలో గరిష్టంగా మూడు నెలైట్ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. దీంతో అమరావతి కేంద్రం రాష్ట్రంలో రెండో నెలైట్ కేంద్రంగా, తిరుపతి కేంద్రానికి అనుబంధంగా ఏర్పాటుకానుందన్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెలైట్ తిరుపతి కేంద్రానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2024 జనవరి 4న ఆమోదం తెలిపింది. రూ.850.09 లక్షల బడ్జెట్‌ను కేటాయించారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సుమారు 8,000 చదరపు అడుగుల నిర్మిత స్థలాన్ని అందించింది. అధికారికంగా 2025 అక్టోబర్‌ 2న ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, అంతకుముందే కేంద్రం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించింది. 2024 నవంబర్‌లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమైనప్పటి నుంచి నెలైట్ తిరుపతి కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సెమీకండక్టర్స్‌ తదితర రంగాల్లో ఇప్పటికే 4,308 మంది అభ్యర్థులకు శిక్షణ అందించింది. శిక్షణ పొందిన వారిలో ఏపీ పోలీస్‌, ఐ4సీ, సీఐడీ, పీఎం శ్రీ, కేంద్రియ విద్యాలయాలకు చెందిన సిబ్బంది, రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు. తిరుపతి కేంద్రం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా ఇంజినీరింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌, వీఎల్ఎస్ఐ, ఎఫ్‌పీజీఏ, ఐవోటీ, రోబోటిక్స్‌, 3డీ ప్రింటింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ తదితర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో విస్తృత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణతో పాటు ఉపాధ్యాయుల అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడుతోంది. అమరావతిలో ప్రతిపాదిత నెలైట్ క్వాంటమ్‌ ఏఐ యూనివర్సిటీ రాష్ట్రంలో నెలైట్ కార్యకలాపాలకు కొత్త, పరస్పరపూరక దశను సూచించనుంది. ఈ కేంద్రం ప్రధానంగా క్వాంటమ్‌ టెక్నాలజీస్‌, ఆర్టిఫ

Original source: prabhanews.com
Read more on Kaizer News