Kaizer News

Irumudi: ఇరుముడి మూవీ హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున

Irumudi: ఇరుముడి మూవీ హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ముద్దుగుమ్మ.. ఎంత పని చేశావ్ అమ్మడు..

· Entertainment · tv9telugu.com

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కేవలం 8 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 146 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, 200 కోట్ల క్లబ్‌ వైపు వేగంగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన తమిళ నటి ప్రియా భవానీ శంకర్ నటనకు, ఆమె పాత్రకు ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల నుండి విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్.. అయితే, ఈ సక్సెస్‌ఫుల్ చిత్రంలో నటించే అవకాశాన్ని మొదట ప్రియా భవానీ శంకర్ కంటే ముందే టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు అందుకోలేకపోయారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. దర్శకుడు శివ నిర్వాణ కథ సిద్ధం చేసిన తర్వాత, ఈ ముఖ్యమైన కథానాయిక పాత్ర కోసం ముందుగా స్టార్ హీరోయిన్ ను సంప్రదించారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మజిలీ’, ‘ఖుషి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. కొన్ని కారణాలతో ఆ హీరోయిన్ ఈ ఆఫర్‌ను నో చెప్పినట్లు సమాచారం. ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు.. ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతార, అనుష్క శెట్టిల పేర్లను కూడా పరిశీలించారు. గతంలో రవితేజ, అనుష్కల కాంబోలో ‘విక్రమార్కుడు’, ‘బలాదూర్’ వంటి సినిమాలు రాగా, ఈ ప్రాజెక్ట్‌లో ఆమె నటించి ఉంటే కెరీర్‌కు మరో పెద్ద ప్లస్ అయ్యేదని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా, యంగ్ అండ్ హాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరిని కూడా ఈ పాత్ర కోసం సంప్రదించగా, కాల్ షీట్లు , డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆమె కూడా ఈ గోల్డెన్ ఛాన్స్‌ను వదులుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా స్టార్ హీరోయిన్లు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవడంతో, ఆ లక్కీ ఆఫర్ ప్రియా భవానీ శంకర్‌ను వరించింది. ‘ఇరుముడి’ భారీ విజయం సాధించడంతో టాలీవుడ్‌లో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్.. ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా

Original source: tv9telugu.com
Read more on Kaizer News