విశాఖపట్నంలోని ప్రసిద్ధ ఆర్కే బీచ్‌లో ఒక పర్యాటకుడికి త్రుటిలో ప్రాణపాయం తప్పింది. రెల్లి వీధికి చెందిన చిన్న ఈశ్వరరావు అనే వ్యక్తి సముద్రంలో జలకాలాడేందుకు దిగగా, ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలలు అతడిని లోపలికి లాక్కెళ్లాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన లైఫ్‌గార్డ్స్ సకాలంలో స్పందించి, ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం అతడికి త్రీటౌన్ సీఐ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు