Kaizer News

వారఫలాలు (ఆగస్ట్30–సెప్టెంబర్ 5): ఈ వారం అదృష్టం వ

వారఫలాలు (ఆగస్ట్30–సెప్టెంబర్ 5): ఈ వారం అదృష్టం వరించే రాశులు ఇవే.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం

· State - Telangana · v6velugu.com

కాల చక్రంలో మరొక నూతన వారం (ఆగస్టు 30) ప్రారంభమైంది. జ్యోతిష్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారంఆగస్టు 30నుంచి సెప్టెంబర్ 5 వ తేది వరకు జరిగే గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.. .! మేషరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగా కలసి వచ్చే అవకాశాలున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులకు అధిక లాభాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు.ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశాలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో .. అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. చేతి వృత్తుల వారికి వారం మధ్యలో అనుకోకుండా ఆర్డర్లు పెరుగుతాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. అయితే ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. మిథునరాశి : ఈ రాశి వారికి ఈ వారంలో కెరీర్​ పరంగా కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి..వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో ఉన్న ఫైనాన్స్​ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ధ్యానం..యోగం చేయడం మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు కర్కాటకరాశి: ఈ వారం ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఇతరులతో సంభాషించే విషయంలో జాగ్రత్తలు పాటించండి. పాత మిత్రులు కలిసే అవకాశం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగస్తులకు .. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సింహరాశి: ఈ రాశి వారు ఈ వారం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా సంయమనం పాటించండి. కార్యలయంలో మీ పని మీరు చేసుకోండి. ఎవరితోనూ అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పాత బాకీలు వసూలైన మనశ్శాంతి ఉండే అవకాశం లేదని పండితులు చెబుతున్నారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుందిం. కంటి..పొట్టకు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు చాలా సంయమనం పాటించాలని పండితులు చెబుతున్నారు. నిత్యం సూర్యనమస్కారాలు చేయడం వలన కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కన్యారాశి: ఈ రాశి వారికి ఈవారం ఆర్థిక పరి

Original source: v6velugu.com
Read more on Kaizer News