Kaizer News

Kukunoor: భూసేకరణ పేరుతో దళారుల వల - కలెక్టర్‌కు ర

Kukunoor: భూసేకరణ పేరుతో దళారుల వల - కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు

· State - Telangana · hmtvlive.com

Shorts కుక్కునూరు: మండలం కొండపల్లి పంచాయతీ పరిధిలోని బర్లమడుగు గిరిజన గ్రామంలో భూసేకరణపై రైతుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎటపాక మండల గిరిజనులకు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం భూసేకరణ చేపడుతోందంటూ కొందరు వ్యక్తులు రైతులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. తమ ద్వారా భూములు ఇస్తే ఎకరాకు రూ.15 లక్షల వరకు పరిహారం ఇప్పిస్తామని, అందులో రూ.1.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు తమకు ఇవ్వాలని కోరుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గోప్యంగా ఉంచాలని మధ్యవర్తులే సూచిస్తున్నారని వారు తెలిపారు. ఈ వ్యవహారంలో జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వమే భూసేకరణ చేపడుతుంటే పరిహారం ఇప్పిస్తామంటూ గ్రామాల్లో మధ్యవర్తులు తిరగటం ఏంటని అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో పరిహారం ఇప్పిస్తామంటూ తిరుగుతున్న మధ్యవర్తుల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ జరిపించాలని, అమాయక రైతులను మోసం చేసి పరిహారం కాజేసేందుకు యత్నిస్తున్న దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే భూ సేకరణ ప్రతిపాదనలు, పరిహారం వివరాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News