Kaizer News

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముత్యాల సునీల్‌

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముత్యాల సునీల్‌కుమార్‌

· State - Telangana · prabhanews.com

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలం సుదర్శన్‌నగర్‌ తండాలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ ముత్యాల సునీల్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ‘విద్యను అభ్యసించండి.. చైతన్యవంతులై పోరాడండి.. సంఘటితం కండి’ అనే అంబేద్కర్‌ సందేశం నేటి తరానికి కూడా మార్గదర్శకమని అన్నారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కల్పించిందని ముత్యాల సునీల్‌కుమార్‌ తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, విద్య ద్వారానే సమాజంలో చైతన్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News