Kaizer News

Amazon Festive sale | మ‌ళ్లీ వ‌స్తున్న అమెజాన్ గ్ర

Amazon Festive sale | మ‌ళ్లీ వ‌స్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్.. ఎప్ప‌టి నుంచో తెలుసా..?

· National - India · ntnews.com

Amazon Festive sale : పండగ సీజన్ (Festive Season) సమీపిస్తుండటంతో ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 (Amazon Great Indian Festival 2026)” రాబోతోంది. ఫెస్ట్‌కు సంబంధించిన‌ తేదీలను ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అతిపెద్ద సేల్‌గా అభివర్ణిస్తున్న ఈ ఫెస్టివల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన “బిగ్ బిలియన్ డేస్ 2026” సేల్‌ను అక్టోబర్ 9న ప్రారంభించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, అమెజాన్ వ్యూహాత్మకంగా ఒకరోజు ముందే తన సేల్‌ను మొదలుపెట్టి పోటీకి సై అంటోంది. ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లు చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఈఎంఐ లావాదేవీలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని అమెజాన్ స్పష్టంచేసింది. ప్రైమ్ మెంబర్లకు కొన్ని ఎంపిక చేసిన ఆఫర్లపై అదనంగా 10% వరకు ప్రయోజనాలు ఉండనున్నాయి. వీటితోపాటు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, నిత్యావసరాలు వంటి అన్ని కేటగిరీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. బ్లాక్‌బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్, రాత్రి 8 గంటల డీల్స్ వంటి ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు అమెజాన్ సిద్ధమైంది. కేవలం డిస్కౌంట్లే కాకుండా ఈసారి షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అమెజాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వీటి ద్వారా వినియోగదారులు ఉత్పత్తులను సులభంగా పోల్చుకోవచ్చు, ధరల హెచ్చుతగ్గుల చరిత్రను చూడవచ్చు, మెరుగైన సిఫార్సులను పొందవచ్చు. దేశవ్యాప్తంగా వేగవంతమైన డెలివరీని అందించే లక్ష్యంతో తన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించింది. ఇందులో భాగంగా 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 6 కొత్త సార్ట్ సెంటర్లు, 150 కొత్త లాస్ట్-మైల్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దీపావళి నాటికి “అమెజాన్ నౌ” (నిత్యావసరాల క్విక్ కామర్స్) సేవలను 100 నగరాలకు విస్తరించాలని అమెజాన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌పై 17 లక్షల మందికి పైగా విక్రయదారులు ఉన్నారని, వీరి సంఖ్య 20 లక్షల మైలురాయిని దాటిందని కంపెనీ పేర్కొన్న‌ది. సేల్ ఎప్పటివరకు కొనసాగుతుందనే విషయం ఇంకా వెల్లడి కాలేదు

Original source: ntnews.com
Read more on Kaizer News