Kaizer News

Kiran Abbavaram | పిల్లితో మొదలైన మిస్టరీ.. ‘హతః’

Kiran Abbavaram | పిల్లితో మొదలైన మిస్టరీ.. ‘హతః’ టైటిల్ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన కిరణ్ అబ్బవరం!

· Entertainment · ntnews.com

Kiran Abbavaram | యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల దాదాపు 50 మంది కొత్తవాళ్లతో తెరకెక్కిన విలేజ్ డ్రామా ‘తిమ్మరాజుపల్లి టీవీ’ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన కిరణ్.. ఇప్పుడు తన బ్యానర్ నుంచి రెండో ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ కొత్త సినిమాకు ‘హతః’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.‘హతః’ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను మేకర్స్ చాలా విభిన్నంగా రూపొందించారు. వీడియో ప్రారంభంలో ఒక చీకటి వాతావరణం కనిపించగా.. ఆ తర్వాత కెమెరా ఒక డార్క్ బాక్స్ వైపు జూమ్ అవుతుంది. ఆ బాక్స్‌లో ఒక పిల్లి కనిపిస్తుంది. చివర్లో ‘హతః’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. అయితే అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. “Is the cat alive or..” అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. పిల్లి బతికే ఉందా? లేదా? అనే ప్రశ్నతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశారు. సినిమా కథ, జానర్, పాత్రలు వంటి విషయాలను ప్రస్తుతానికి పూర్తిగా రహస్యంగా ఉంచారు. ‘హతః’ గురించి మేకర్స్ చెబుతున్న మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని తరహా కథతో ఈ సినిమా రూపొందుతోందట. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, కొత్త జానర్‌లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్‌తో పాటు గ్లింప్స్, క్యాప్షన్‌లోనూ మిస్టరీని కొనసాగించడంతో అసలు సినిమా ఏ జానర్‌కు చెందింది? కథ ఏంటి? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఒక్క పిల్లిని ప్రధానంగా చూపిస్తూ టైటిల్‌ను ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ తర్వాత కిరణ్ అబ్బవరం నిర్మాణంలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. కిరణ్ అబ్బవరం, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు అనుష్ గోరాక్ రచన, దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లు మద్దాల, రెహ్మాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టస్వామి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జెసిన్ జార్జ్ సంగీతం అందిస్తుండగా, అఖిల్ చక్రవర్తి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ‘హతః’ చిత్రానికి సంబంధించిన షూటింగ్, కథ, పాత్రలు, విడుదల తేదీ వంటి వివరాలను మేకర్స్ సస్పెన్స్‌లోనే ఉంచారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌తోనే సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్రబృందం.. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది

Original source: ntnews.com
Read more on Kaizer News